బల్లికురవ మండలం నక్కబొక్కలపాడులో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. రైతు ధూళిపాళ్ల వీరాంజనేయులు (55) పాము కాటుతో మృతి చెందారు. స్థానికుల సమాచారం ప్రకారం, గత ఆరు నెలల వ్యవధిలో ఆయన రెండుసార్లు పాము కాటుకు గురైనా చికిత్సతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే మంగళవారం ఉదయం మరోసారి పాము కరవడంతో పరిస్థితి విషమించి క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. వరుసగా మూడోసారి పాము కాటుకు బలైన ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.