బాపట్లలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

1536చూసినవారు
బాపట్ల మండల పరిధిలోని నాగరాజు కాలువ బ్రిడ్జిపై బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్ల నుండి గుంటూరు వైపు ఇసుక లోడుతో వస్తున్న లారీ, గుంటూరు నుండి బాపట్ల వైపు వస్తున్న రొయ్యల మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రొయ్యల మినీ లారీ డ్రైవర్, క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ లారీలో ఇరుక్కుపోవడంతో స్థానికులు అతన్ని బయటకు తీశారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాపట్ల రూరల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you