ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు మనో తన సతీమణితో కలిసి బుధవారం పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వారికి ఆలయ అర్చకులు, నిర్వాహకులు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మనో మాట్లాడుతూ, బండ్లమ్మ తల్లి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని, ఆలయ ఆధ్యాత్మిక వాతావరణం తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు.