ఏ పాఠశాలలోనూ ఫ్లెక్సీలు కట్టరాదు: బాపట్ల కలెక్టర్

3చూసినవారు
ఏ పాఠశాలలోనూ ఫ్లెక్సీలు కట్టరాదు: బాపట్ల కలెక్టర్
పాఠశాలలకు మంజూరైన పరికరాలు, ఆట వస్తువులన్నింటిని పీటీఎం (తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం) కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించాలని సూచించారు. పాఠశాలల్లో ఎక్కడా ఫ్లెక్సీలు కట్టరాదని, పదో తరగతి పరీక్షల్లో 100% విద్యార్థుల ఉత్తీర్ణత సాధించేలా చూడాలని తెలిపారు. విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించేటప్పుడు నిర్దిష్ట జాగ్రత్తలు పాటించాలని, అపార్ ఐడీలను నూరు శాతం నవీకరించాలని కలెక్టర్ సూచించారు.