పెదనందిపాడు సమీపంలో నక్కవాగుకు మంగళవారం గండి పడటంతో పెదనందిపాడు మరియు నాగులపాడు గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. నల్లమడ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పెదనందిపాడు-కొమ్మూరు బాపట్ల హైవేపై గుంటూరు, పర్చూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కాకుమాను మండలంలోని గార్లపాడు, కొమ్మూరు గ్రామాలు వరదలో మునిగిపోయాయి. ముఖ్యంగా గార్లపాడు గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో సహాయక చర్యలు చేపట్టడానికి తీవ్ర అంతరాయం కలుగుతోందని సమాచారం.