కాలువలో పడి పూల వ్యాపారి మృతి: బంధువుల ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన

2094చూసినవారు
బాపట్ల జిల్లా చీరాల మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని దండుబాట స్వర్ణ రోడ్డులోని పంట కాలువ వద్ద మీసాల ఉమా (32) అనే పూల వ్యాపారి కలువ పూల కోసం కాలువలో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఇంటికి రాకపోవడంతో బంధువులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గాలించిన తర్వాత మృతదేహం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్