బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి బాల కార్మిక నిర్మూలన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకాల కింద కార్మికుల వివాహానికి రూ. 20 వేల ప్రోత్సాహకం, సాధారణ మరణం సంభవిస్తే రూ. 60 వేల ఆర్థిక సాయం, అంత్యక్రియల ఖర్చుల కోసం రూ. 20 వేలు, మహిళా కార్మికులకు రెండు ప్రసవాల వరకు రూ. 40 వేల చొప్పున అందజేయనున్నట్లు వివరించారు. అర్హులైన కార్మికులు ఈ పథకాల ప్రయోజనాలను వినియోగించుకోవాలని సూచించారు.