క్షీర భావనారాయణ స్వామి దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా

1234చూసినవారు
క్షీర భావనారాయణ స్వామి దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా
బాపట్ల పట్టణంలోని శ్రీ క్షీర భావనారాయణ స్వామి దేవాలయంలో సంపత్ గణపతి పరివార్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా సంపత్ గణపతికి శాస్త్రోక్తంగా సామూహిక కుంకుమార్చన పూజలు, అనంతరం తలంబ్రాల మహోత్సవాన్ని కన్నులపండువగా జరిపారు. ఈ విశేష పూజల అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్