కొల్లూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని బావిరెడ్డి దివ్య తేజశ్రీ పదో తరగతి పరీక్షల్లో 600కు 596 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని ఎంఈఓలు రమాదేవి, జ్యోతి గురువారం తమ కార్యాలయం నుంచి వెల్లడించారు. దివ్య తేజశ్రీ కొల్లూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని.