ఈపురుపాలెం సమీపంలో గడ్డివాము ట్రాక్టర్ బోల్తా

2203చూసినవారు
ఈపురుపాలెం సమీపంలో గడ్డివాము ట్రాక్టర్ బోల్తా
నిబంధనలకు విరుద్ధంగా మితిమీరిన లోడుతో వెళ్తున్న గడ్డి ట్రాక్టర్లు ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. బుధవారం బాపట్ల మండలం ఈపురుపాలెం ప్రధాన రహదారిపై గడ్డివాము లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. వరుస ప్రమాదాలు జరుగుతున్నా యజమానులు, అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తు వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్