సూర్యలంక సముద్ర తీరంలో శ్రీ సంపత్ గణపతి నిమజ్జనం

1136చూసినవారు
సూర్యలంక సముద్ర తీరంలో శ్రీ సంపత్ గణపతి నిమజ్జనం
బాపట్ల పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ క్షీర భావనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్న శ్రీ సంపత్ గణపతి నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది. గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు పర్వంలో భాగంగా, శుక్రవారం మధ్యాహ్నం 3: 00 గంటల నుండి శ్రీ సంపత్ గణపతి నగరోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, కోలాహలంగా ప్రారంభమైంది. పట్టణ పురవీధుల గుండా సాగిన ఈ శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, మంగళహారతులు పడుతూ స్వామివారికి ఘనంగా వీడ్కోలు పలికారు. రాత్రి వేళ సూర్యలంక సముద్ర తీరంలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య శ్రీ సంపత్ గణపతి నిమజ్జనం శాస్త్రోక్తంగా జరిగింది.

సంబంధిత పోస్ట్