మహిళను బంధువులకు అప్పగించిన కర్లపాలెం ఎస్సై

980చూసినవారు
మహిళను బంధువులకు అప్పగించిన కర్లపాలెం ఎస్సై
గత మూడు సంవత్సరాల క్రితం కర్లపాలెం మండలం నర్రవారిపాలెం గ్రామానికి చెందిన ఒక వివాహిత ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కర్లపాలెం ఎస్సై రవీంద్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆమె ఆచూకీ తెలుసుకొని మంగళవారం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఇంట్లో ఉన్న సమస్యలు, భర్తతో ఉన్న బాధలు, తల్లిదండ్రులతో వచ్చిన ఇబ్బందులు, అంతేకాకుండా కులాంతర వివాహాలు చేసుకున్న ఆడపిల్లలు క్షేమంగా ఉన్నారో లేదో ఒక్కసారి వారికి ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్