శనివారం ఉదయం సంతమాగులూరు(M) పుట్టవారి పాలెం నామ్ రోడ్డులో లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న టీ దుకాణంలోకి దూసుకుపోయింది. నరసరావుపేట వైపు నుంచి వస్తున్న ఈ ఘటనలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.