బాపట్ల మార్కెట్ యార్డ్ సమీపంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలై, కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.