బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్‌లో శుక్రవారం స్నానానికి వెళ్లి సముద్రపు అలల్లో చిక్కుకున్న వ్యక్తిని మెరైన్ పోలీసులు చాకచక్యంగా కాపాడారు. అలల ఉద్ధృతికి లోపలికి వెళుతున్న వ్యక్తిని గమనించిన పోలీసులు వెంటనే స్పందించి అతన్ని ఒడ్డుకు చేర్చారు. అప్రమత్తతతో వ్యవహరించిన పోలీసుల చర్యలను స్థానికులు, పర్యాటకులు ప్రశంసించారు. సముద్రంలోకి దిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.