మార్టూరు: విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

9చూసినవారు
మార్టూరు: విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
శనివారం రాత్రి 7 గంటల సమయంలో మార్టూరులోని సీతాదేవినగర్‌లో రేకుల షెడ్డుపై తారుపట్టలు కప్పే పనిలో ఉండగా, ఇనుప నిచ్చెన విద్యుత్ తీగలకు తగలడంతో అశోక్ (43) అనే కార్మికుడు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. సమీపంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకున్న వైకాపా జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున మార్టూరు విచ్చేసి, మృతదేహం వద్ద నివాళి అర్పించారు.

సంబంధిత పోస్ట్