మార్టూరు: కత్తితో మామను పొడిచిన అల్లుడు

0చూసినవారు
మార్టూరు: కత్తితో మామను పొడిచిన అల్లుడు
నగదు చెల్లింపు విషయంలో మామ, అల్లుడి మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. మార్టూరులోని కోరిగుంటలో నివసించే కొప్పరపు హుస్సేన్ సాహెబ్ (55)కు, అతని అల్లుడు నూర్బాషాకు మధ్య రూ.80 వేల నగదు చెల్లింపు విషయంలో శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. ఈ క్రమంలో నూర్బాషా కత్తితో మామను కడుపులో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. మార్టూరు సీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తుండగా హుస్సేన్ సాహెబ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్