బాపట్ల పట్టణంలోని తూర్పు సత్రం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు మంగళవారం సాయంత్రం 5.00 గంటలకు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను, ప్రత్యేక డెకరేషన్, ఆకర్షణలను ఆయన స్వయంగా సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఇంతటి భారీ ప్రదర్శనను ప్రజల ముందుకు తీసుకువచ్చిన నిర్వాహకులను ఆయన అభినందించారు.