బాపట్ల నియోజకవర్గంలో తాము చేస్తున్న అభివృద్ధి పనులను చూసి మాజీ ఎమ్మెల్యే కోనా రఘుపతికి కడుపు మంటగా ఉందని, అందుకే గతవారం మీడియా ముందు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వేగేసేశన నరేంద్ర వర్మ మంగళవారం తీవ్రంగా స్పందించారు. తన వ్యక్తిగత విషయాలపై మాట్లాడితే, తాను కూడా వారి వ్యక్తిగత విషయాలపై మాట్లాడతానని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆయన పరోక్షంగా వైసీపీ నేతను హెచ్చరించారు.