బాపట్లలో మున్సిపల్ ఏస్ఐ ఇమామ్ ఇంటి పత్రాల వ్యవహారంలో రూ. 60 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. బాధితుడు దేవరకొండ సుబ్బారావు ఇప్పటికే రూ. 50 వేలు ఇచ్చినప్పటికీ, నిందితుడు మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం దాడి చేసిన అధికారులు ఏస్ఐని పట్టుకుని విచారణ చేపట్టారు. లంచం అడిగితే 1064 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ ప్రజలకు సూచించారు.