నిజాంపట్నం గ్రామ దేవత శ్రీ మొగదారమ్మ తల్లి సిడిమాను మహోత్సవాల సందర్భంగా బస్ స్టాండ్ సెంటర్‌లో అమ్మవారి ఆకారంలో ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్ల ఫ్రేమ్ స్టాండ్లు విద్యుత్ తీగలపై పడి తెగిపోవడంతో కాసేపు కలకలం రేగింది. ప్రజలు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ డీఈఈ సురేశ్ బాబు సిబ్బందితో మరమ్మతులు చేయించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.