బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. 57వ వ్యవస్థాపక దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ డాక్టర్ పి. ప్రసూన రాణి మాట్లాడుతూ నిస్వార్థంగా చేసే సేవే నిజమైన సేవ అని, ఆ లక్ష్యంతో సాగిన మహాత్మా గాంధీ జీవితాదర్శమే ఎన్.ఎస్.ఎస్. ఆవిర్భావానికి నాంది అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎన్.ఎస్.ఎస్. సేవలు విస్తరించాయని, ముఖ్యంగా
విద్యార్థులు వాలంటీర్లుగా అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని ఆమె కొనియాడారు.