ఆదివారం పిట్టలవానిపాలెం మండలం మండే వారి పాలెం గ్రామ సమీపంలో పిట్టలవాని పాలెం-నిజాంపట్నం రహదారిపై లారీ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్తంభాలు విరిగిపోయాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు.