బాపట్ల జిల్లా మార్టూరు మండలం డేగర మూడీ ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు వివాదాస్పదమైంది. టిడిపి నాయకుల మాట వినకుండా విగ్రహం ఏర్పాటు చేశారనే కారణంతో, ఫ్లెక్సీలు చించారనే ఆరోపణలపై అల్లాడి ప్రమోద్ కుమార్, పోతులూరి జ్యోతి అనే దళిత యువకులను మార్టూరు పోలీస్ స్టేషన్ కు పిలిపించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసుల దాడిలో గాయపడిన యువకులు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లగా, దెబ్బలు కనిపించడం లేదని చికిత్స నిరాకరించారని బాధితులు తెలిపారు.