మార్టూరు మండలం డేగర మూడీ ఎస్సీ కాలనీవాసులు టిడిపి నాయకుల అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటు చేసుకున్నారని అక్కస్సుతో గ్రామానికి చెందిన ఇద్దరు దళిత యువకులపై ఫ్లెక్సీలు చించారనే తప్పుడు కేసు బనాయించి విచారణ పేరుతో మార్టూరు పోలీస్ స్టేషన్ కి పిలిపించి సీఐ విచక్షణారహితంగా కొట్టడంతో గాయపడిన యువకులను మార్టూరు ప్రభుత్వ వైద్యశాలలో పర్చూరు వైసిపి ఇన్ చార్జి గాదే మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. అధికారం ఎల్లవేళలా ఉండదని పోలీసులు గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు.