పెట్రోల్ బంకులలో నిబంధనలు ఉల్లంఘించి పెట్రోల్,డీజిల్ కొరత సృష్టిస్తే ఆయిల్ బంకులను సీజ్ చేస్తామని బాపట్ల ఆర్డీఓ గ్లోరియా అన్నారు.మంగళవారం బాపట్ల పట్టణంలోని ఫిల్లింగ్ స్టేషన్లను ఆమె సిబ్బంది తో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫిల్లింగ్ స్టేషన్లో స్టాక్ రిజిస్టర్ మౌలిక వసతులు తదితర అంశాలను ఆమె పరిశీలించారు. వాహనదారులతో మాట్లాడి వారికి అధైర్య పడవద్దని పెట్రోలు డీజిల్ సమృద్ధిగా ఉందని ఆమె పేర్కొన్నారు.