బాపట్లలో పెట్రోల్ బంకులపై పరిమితి నోటీసులు.. ప్రజల్లో గందరగోళం

1220చూసినవారు
బాపట్లలో పెట్రోల్ బంకులపై పరిమితి నోటీసులు.. ప్రజల్లో గందరగోళం
బాపట్ల పట్టణంలోని పెట్రోల్ బంకులకు ఆదివారం రాత్రి నుంచి ప్రభుత్వం ఇంధన పరిమితి నోటీసులు జారీ చేసింది. ద్విచక్ర వాహనాలకు రూ. 200, కార్లకు రూ. 1000 వరకు మాత్రమే ఇంధనం ఇవ్వాలని సూచించింది. నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం, ఇలాంటి పరిమితులు విధించడం గందరగోళానికి దారితీస్తోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిపై స్పష్టత కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్