సంతమాగులూరు మండలం పాత మాగులూరు గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నరసరావుపేట వైపు వెళుతున్న గుర్తుతెలియని వాహనం, టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్‌పై వెళుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.