శనివారం చీరాల 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన బైక్ రోడ్డు పక్కన వెళ్తున్న రిక్షాను వెనుక నుంచి ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న శివరామకృష్ణ, రిక్షా పుల్లర్ శ్రీనివాసరావు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బైక్ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.