ఇంట్లో దోపిడీ.. గోడపై పేరు రాసి పోలీసులకు సవాల్

312చూసినవారు
బాపట్లలో అర్ధరాత్రి దొంగలు హల్ చల్ చేశారు. రైలు పేటకు చెందిన సయ్యద్ అన్వార్ బాషా అనే స్కూల్ పిటి మాస్టర్ ఇంట్లో దోపిడీకి పాల్పడిన దుండగులు తమ పేర్లను గోడపై రాసి పోలీసులకే సవాల్ విసరడం చర్చనీయాంశమైంది. చోరీ అనంతరం కుటుంబ సభ్యుల ఫోటోలపై రెడ్ స్కెచ్ పెన్ తో మార్క్ చేశారు. అయితే ఎవరో తెలిసిన వ్యక్తులే కక్షపూరితంగా ఇంట్లోకి అర్ధరాత్రి ప్రవేశించి ఈ విధంగా ఇంటి యజమానులకు ఓ సందేశం ఇచ్చి వెళ్లారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు లక్షలు విలువైన లాప్టాప్ లు మరియు కొంత నగదును దొంగలు అపహరించారు.

సంబంధిత పోస్ట్