సంతమాగులూరు: లారీ ఢీకొని వ్యక్తి మృతి

1చూసినవారు
సంతమాగులూరు: లారీ ఢీకొని వ్యక్తి మృతి
ఏల్చూరు - కొమ్మలపాడు గ్రామాల మధ్య బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి దుర్మరణం చెందారు. బ్రాహ్మణపల్లికి చెందిన శ్రీనివాసరావు ద్విచక్ర వాహనంపై అంబటిపూడి వెళ్తుండగా, అద్దంకి వైపు అతివేగంగా వస్తున్న లారీ నిర్లక్ష్యంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పట్టాభిరామయ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్