సంతమాగులూరు మండలం కుందుర్రులో బుధవారం గుంజి నవీన్ (27) అనే యువకుడు ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే మనస్థాపంతో విషం తిని ఆత్మహత్య చేసుకున్నాడు. చిలకలూరుపేటలో ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న నవీన్, కొంతకాలంగా కుందూరులో నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.