శనివారం బాపట్లలో రైల్వే సిగ్నల్ ఇంజినీరింగ్ అధికారి నెమలికంటి దావీదు (50) ట్రాక్ దాటుతుండగా వేగంగా వస్తున్న శబరి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని మృతి చెందారు. ఇంటి నుంచి నడకకు వెళ్ళిన ఆయన బేతనీ కాలనీ వద్ద పట్టాలు దాటుతుండగా ఈ ఘోరం జరిగింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించిన దావీదు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సరస్వతి పేర్కొన్నారు.