మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఉమామహేశ్వర్ జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో, అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఉంచాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర కాల్స్ కు త్వరగా స్పందించాలని సూచించారు. జిల్లా యంత్రాంగంతో అనుసంధానమై పనిచేయాలని తెలిపారు.