హరిద్వార్ మహాకలశంలో ఉన్న పుణ్య జలంకు ప్రత్యేక హారతులు

3262చూసినవారు
హరిద్వార్ మహాకలశంలో ఉన్న పుణ్య జలంకు ప్రత్యేక హారతులు
బాపట్లలోని శ్రీ క్షీర భావనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో,శ్రీ సంపత్ గణపతి పరివార్ నిర్వాహకులు బాబూ నాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంపత్ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి విశేష అర్చనలు జరిగాయి.ఈ కార్యక్రమం తర్వాత, హరిద్వార్ నుండి విచ్చేసిన స్వామీజీ గాయత్రీ దేవి విశిష్టత గురించి చేసిన ప్రసంగం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. వారు హరిద్వార్ నుండి 2400 పుణ్య నదులు, ఉపనదులు, కాలువలు, సముద్రాల నుండి సేకరించిన పవిత్ర జలంతో కూడిన "మహాగాయత్రీ కలశాన్ని" తీసుకువచ్చారు. శ్రీ సంపత్ గణపతి స్వామి వారి ముందు ఉంచి ప్రత్యేక హారతి సమర్పించారు.

సంబంధిత పోస్ట్