బాపట్ల పట్టణంలోని రైలుపేట ప్రాంతంలో దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న దుండగులు, ఓ ఇంటి గోడపై "నన్ను పట్టుకోలేరు" అంటూ రాసి పోలీసులకు సవాల్ విసిరారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న కొన్ని ఫోటోలపై రెడ్ పెన్‌తో గుర్తులు పెట్టినట్లు బాధితులు తెలిపారు. గతంలో కూడా ఇదే తరహాలో చోరీలు జరిగిన నేపథ్యంలో దొంగలను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.