తిరుపతి లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేతలకు ప్రాయశ్చిత్తం కలగాలని బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. తిరుపతి లడ్డూలో ఎటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో శనివారం బాపట్ల భావనారాయణ స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించి కూటమి నేతలకు ప్రాయశ్చిత్తం కలగాలని, వారికి క్షమాభిక్ష పెట్టాలని స్వామివారిని వేడుకున్నామన్నారు.