అద్దంకిలో రాష్ట్రీయ రహదారిపై వాహనాల రద్దీతో ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. శనివారం భవాని సెంటర్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో, సీఐ సుబ్బరాజు సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. అద్దంకికి మినీ బైపాస్ రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.