బల్లికురవ మండలంలోని నక్కబొక్కలపాడులో మంగళవారం ఉదయం పాము కాటుకు గురై రైతు ధూళిపాళ్ల వీరాంజనేయులు (55) మృతి చెందారు. గత ఆరు నెలల్లో ఇది మూడోసారి పాము కాటు. గతంలో రెండుసార్లు పాము కాటు నుంచి బయటపడిన వీరాంజనేయులు, మంగళవారం ఉదయం మరోసారి పాము కాటుకు గురికావడంతో అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. సుబాబుల్ తోట చూసేందుకు వెళ్ళినప్పుడు, ఇంటి దగ్గర కాలవ శుభ్రం చేస్తున్నప్పుడు ఆయనకు గతంలో పాము కాటు వేసింది.