బాపట్ల పట్టణంలోని ఉప్పరపాలెం రోడ్ జమేడారపేట కూరగాయల షాపు వద్ద సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడు సుమారు 55-60 ఏళ్ల వయస్సు కలవాడని, నలుపు-తెలుపు చొక్కా, బులుగు గళ్ళ లింగీ ధరించి ఉన్నాడని తెలిపారు. అతని ఆచూకీ తెలిసినవారు బాపట్ల పట్టణ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మృతదేహాన్ని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు.