
స్కూటీని ఢీ కొట్టిన ఆటో.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
TG: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామ శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఆటో.. ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంచు శ్రీనివాస్, విజయ్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆటో డ్రైవర్ షాహేద్పై దర్యాప్తు ప్రారంభించారు.




