జిల్లాలో వాణిజ్య పన్నుల వసూళ్లు నెలకు రూ.35 కోట్లు వసూలవుతోందని గురువారం బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ వెల్లడించారు. రూ.15 వేల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రొఫెషనల్ టాక్స్ చెల్లించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లపై TDS కింద GST వసూలు చేయాలని ఆదేశించారు. గ్రానైట్ పరిశ్రమల్లో పన్ను ఎగవేతను అరికట్టేందుకు పోలిస్, రవాణా, ఖనిజ శాఖల సమన్వయంతో పని చేయాలన్నారు.