విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి

1070చూసినవారు
బాపట్ల జిల్లా మార్టూరులోని మద్ది సీతాదేవి కాలనీలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. మద్దిపాడు మండలం వెంకటరాజుపాలెం గ్రామానికి చెందిన దాసరి అశోక్ కుమార్ ఉపాధి నిమిత్తం రేకుల షెడ్డు నిర్మాణ పనులు చేపట్టాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్