మంగళవారం యద్దనపూడి మండలం పూనూరులో జంగం కుంట వద్ద శనగల బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. వాగులో పడిన శనగల బస్తాలను అటుగా వెళ్తున్న రైతులు గమనించి ఒడ్డున వేశారు. అనంతరం ప్రొక్లైన్ సాయంతో వాగులో పడిన ట్రాక్టర్‌ను బయటకు తీశారు.