బాపట్ల పట్టణంలోని వివేకానంద కాలనీలో గల మున్సిపల్ పార్కును ఆదివారం ఉదయం బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ సందర్శించారు. పార్కులో వాకింగ్ చేస్తున్న వారితో మాట్లాడి, అభివృద్ధిపై ఆరా తీశారు. అనంతరం వారితో కలిసి యోగా చేసి ఉత్సాహపరిచారు. పార్కు అభివృద్ధి వల్ల స్థానికులకు వ్యాయామం చేసే అవకాశం లభించిందని ఆయన తెలిపారు.