వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్న అరెస్ట్..!

7చూసినవారు
వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్న అరెస్ట్..!
టీటీడీలో కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ఒంగోలు మాజీ ఎంపీ, మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్నను సిట్ అధికారులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. బ్లాక్ లిస్ట్లో ఉన్న బోలెబాబా డెయిరీ, వేరొక డెయిరీని ముందుపెట్టి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. కమీషన్ల కోసం ఈ విషయం తెలిసినా అధికారులు మౌనంగా ఉన్నారనే ఆరోపణలపై సిట్ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే అప్పన్నను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్