Nov 01, 2025, 01:11 IST/
గుడ్ న్యూస్.. విద్యార్థుల ఖాతాల్లోకే డబ్బులు!
Nov 01, 2025, 01:11 IST
TG: ఎస్టీ, బీసీ, మైనార్టీ, EBC విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇకపై నేరుగా వారి ఖాతాల్లోకే ఫీజు రీయింబర్స్మెంట్ సోమ్ము జమ కానుంది. పెండింగ్ బకాయిలు ఉండటంతో కొన్ని కాలేజీలు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందిస్తున్న SC విద్యార్థుల తరహాలో మిగతా వారికీ అమలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఏటా 12.5 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.2,600Cr వెచ్చిస్తోంది.