జీఎస్టీ 2.0పై కిరాణా వ్యాపారులకు అవగాహన

3చూసినవారు
చీరాలలో కిరాణా మర్చంట్ అసోసియేషన్ హాలులో వాణిజ్య పనుల శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీ యస్.కె.జమీర్ బాషా మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ సంస్కరణలను అమలు చేయడంలో వ్యాపారస్తులు సహకరించి ప్రజలకు ఫలాలు అందించాలని కోరారు. వాణిజ్య పనుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ ఆర్. శ్రీనివాసరావు ధరలు తగ్గించి వినియోగదారులకు వస్తువులు అందించాలని, తగ్గిన ధరల వివరాలను షాపుల ముందు బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. వినియోగదారుల సమాచార కేంద్రం కన్వీనర్ శ్రీ డి.ఇమ్మానుయేల్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జీఎస్టీ సంస్కరణ సమాచారాన్ని ప్రతి గడపకు చేర్చాలని, మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్లు 1915, 1967 వినియోగించుకోవాలని కోరారు. వ్యాపారస్తులు వ్యక్తం చేసిన సందేహాలను అధికారులు నివృత్తి చేశారు.

ట్యాగ్స్ :