దేవాంగపురిలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం

2చూసినవారు
దేవాంగపురిలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం
బాపట్ల జిల్లా, చీరాల రూరల్ మండలం దేవాంగపురి గ్రామపంచాయతీ పరిధిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గురువారం కూరగాయల మార్కెట్‌లో కూరగాయలు విక్రయించే మహిళలు, కొనుగోలుదారులకు ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను వివరించారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా నూలు సంచులు, పునర్వినియోగ సంచులు ఉపయోగించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ ఎం. శ్రీనివాసరావు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్