బాపట్ల జిల్లా అద్దంకి, కొరిశపాడు మండలం కనగాల వారి పాలెం నుంచి మాలంపాటివారిపాలెం వెళ్లే రహదారిలో గత సంవత్సరం నుంచి బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతోందని, దీనివల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని శనివారం ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తికాకపోవడంతో బస్సులు రాకపోకలు నిలిచిపోయాయని, ద్విచక్ర వాహనాలపై 15 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని వాపోయారు. గుత్తేదారులు పనులు నాసిరకంగా చేస్తున్నారని ఆరోపించిన ప్రజలు, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.